Karthika deepam2 : గౌతమ్ ని దీప గుర్తుపడుతుందా.. జ్యోత్స్నకి పెళ్ళిచూపులు!
on Mar 18, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -307 లో..... కార్తీక్ రెస్టారెంట్ కి వెళ్తుంటే మేమ్ కూడా వస్తామని కాంచన అంటుంది. టిఫిన్ సెంటర్ కి సెలవు ఇచ్చింది.. మీరు రెస్ట్ తీసుకోవడానికి అక్కడికి తీసుకొని వెళ్ళడానికి కాదని కార్తీక్ అనగానే.. మరి ఇంట్లో బోర్ గా ఉంటుందని అనసూయ అనగానే అయితే బూజు కర్రపట్టుకొని ఇల్లంతా క్లీన్ చెయ్యండి అని శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. అది సరిపోకపొతే మా ఇంట్లోకి వెళ్లి క్లీన్ చెయ్యండి అని శ్రీధర్ అంటాడు. ఇంట్లో బుజు ఏంటి ఒంటికి పట్టిన బూజు కూడా క్లీన్ చేస్తారని కార్తీక్ అంటాడు.
ఎందుకు వచ్చారో చెప్పండి అని కార్తీక్ అడుగుతాడు. మీరు వచ్చి నాకు స్వీట్స్ ఇవ్వాలిసింది పోయి మీకే స్వీట్ ఇస్తున్నానని శ్రీధర్ అంటాడు. ఎందుకని కార్తీక్ అడుగుతాడు. నిన్న కావేరితో గుడ్ న్యూస్ అంటూ స్వప్న చెప్తుంది కదా అంటే ఆస్తులలో మీ తాత వాటా రాశాడానే కదా అని శ్రీధర్ అంటాడు. అలా అని మీరు అనుకుంటున్నారు స్వప్న గుడ్ న్యూస్ అంది జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకున్నందుకు అని కార్తీక్ చెప్పగానే శ్రీధర్ షాక్ అవుతాడు. అంత బాగుంటే జ్యోత్స్నని పెళ్లి చేసుకొని ఆస్తుల అన్నిటికి నువ్వే వారసుడువి అయ్యేవాడివి.. ఈ మహాతల్లి ని చేసుకున్నావ్ తను నీ జీవితంలోకి వచ్చినప్పటి నుండి నీకు అన్నీ కష్టాలే అని దీపని శ్రీధర్ అంటాడు. కార్తీక్ చూడలేక అమ్మ ఆతన్ని ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పు లేదంటే భార్య కోసం తండ్రి మీద చెయ్ చేసుకున్నాడని అంటారని కార్తీక్ అనగానే శ్రీధర్ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత కార్తీక్, దీప వెళ్తుంటే శ్రీధర్ అన్న మాటలకి దీప బాధపడుతుంది. కార్తీక్ ఫోన్ మాట్లాడతాడు. అప్పుడే గౌతమ్ ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉండడం దీప చూస్తుంది. దీప కోపంగా వాళ్ల కార్ పైకి రాయి విసిరుతుంది. ఆ లోపే కార్ వెళ్తుంది. ఎవరు వాళ్ళు అని కార్తీక్ అడుగుతాడు. మొన్న చెప్పాను కదా పనిమనిషికి కడుపు చేసి డబ్బులతో కొనాలని అనుకున్నాడు అన్న కదా వాడే అని దీప చెప్తుంది. ఎంత మందిని అని మనం ఆపగలమని కార్తీక్ అంటాడు. అమ్మాయిలు మరి ఇలాంటి వాళ్ళను నమ్ముతున్నారని దీప అంటుంది. మరొకవైపు జ్యోత్స్నకి పెళ్లి చూపులు జరుగుతాయి ముందు గౌతమ్ వాళ్ల పేరెంట్స్ వస్తారు. ఆ తర్వాత గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు. అమ్మానాన్న లతో వచ్చేవాడిని కానీ టెంపుల్ కి వెళ్లి వచ్చేసరికి లేట్ అయింది అని గౌతమ్ అనగానే ఎంత మంచివాడు అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న రెడీ అయి కిందకి వస్తుంది. తనని చూసి గౌతమ్ ఫ్లాట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
